12 June, 2026 | 4:32 PM

స్కై వాక్ లిఫ్ట్ లో చిక్కుకున్న యువకుడు.. రెండు గంటలపాటు నరకయాతన

12-06-2026 03:55 PM

ఉప్పల్,(విజయక్రాంతి): హైదరాబాద్ ఉప్పల్ లో సర్కిల్ వద్ద ఉన్న  స్కై వాక్ లిఫ్ట్లలో  ఓ యువకుడు చిక్కుకొని రెండు గంటలు నరకాయాత్ర అనుభవించారు. వివరాల్లోకెళ్తే  ఉప్పల్లో శ్రీలక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్ లో నివాసం ఉంటున్న రాహుల్ (20 ) ఎన్ ఆర్ పి లో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకొని రాత్రి సుమారు 11:30 సమయంలో  హాస్టల్ కు వెళుతున్న సమయంలో ఉప్పల్ చౌరస్తాలో ఉన్న  సిక్స్ బి  స్కై వాక్  లిఫ్ట్ ఎక్కి కిందికి దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది.

దీంతో రాహుల్ లిఫ్ట్ లోనే చిక్కుపోయి తీవ్ర భయాందోళనకు  గురయ్యాడు. సుమారు రెండు గంటల పాటు లిఫ్ట్ లో నరకయాత్రన అనుభవించారు . సమాచారం అందుకున్న హైడ్రాధికారులు ఉప్పల్ పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలం ని కి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి లిఫ్ట్ తలుపులు తెచ్చేందుకు దాదాపు రెండు గంటల పైగా శ్రమించారు.

చివరికి టెక్నీషియన్ రాత్రి ఒకటి 15 గంటల సమయంలో వచ్చి లిఫ్ట్ లో ఉన్న రాహుల్ను సురక్షితంగా బయటికి తీశారు. లిఫ్ట్ నిర్వహణ  చూస్తున్న కృష్ణ కన్స్ట్రక్షన్ సిబ్బంది హెచ్ఎండిఏ అధికారులు సకాలంలో స్పందించకపోవడంపై  పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా స్కై వాక్ దగ్గర ఉన్న లిఫ్టుల  పనితీరును పరిశీలించి  మరమ్మతులు చేయించాలని  పలువురు కోరుతున్నారు