10-01-2026 12:00:00 AM
సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభించిన ఎస్‌ఐ
కేసముద్రం, జనవరి 9 (విజయక్రాంతి): ఆటల పట్ల ఆసక్తి పెంపొం దించుకొని యువత క్రీడల్లో రాణించాలని కేసముద్రం ఎస్‌ఐ క్రాంతి కిరణ్ పిలుపునిచ్చారు. సీఎం కప్ క్రీ డా టార్చి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడు తూ క్రీడల పట్ల ఆసక్తి కలగడానికి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి సీఎం కప్ క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో రాణిస్తున్న క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు పు రస్కారం అందజేస్తూ ప్రోత్సహిస్తుందన్నారు.
క్రీడల అభివృద్ధి కోసం స్పోరట్స్ యూనివర్సిటీ, స్పోరట్స్ స్కూల్ ను ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. గ్రామీణ యువతకు, విద్యా ర్థులు క్రీడల్లో రాణించడానికి, మెలుకువలు నేర్చుకోవడానికి ఎంతో ఉప యోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, ఆర్టిఏ డైరెక్టర్ రావుల మురళి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.రాజు, కాం గ్రెస్ నాయకులు నీలం దుర్గేష్, మేక ల వీరన్న యాదవ్, అంబటి మహేందర్ రెడ్డి, దసృనాయక్, డివైఎస్‌ఓ జ్యోతి, పీడీలు రాజేందర్, శంకర్, వి జయచందర్, పద్మ, స్రవంతి తదిత రులు పాల్గొన్నారు.