10-01-2026 12:00:00 AM
దోపిడి ముఠా వాడిన బొలెరో, బెలనో వాహనాలు సీజ్
నిజామాబాద్ జిల్లాతో పాటు జీడిమెట్ల, జహీరాబాద్, సంగారెడ్డిలలో కేసులు
మూడు జిల్లాల్లో దోపిడీలు, నిజాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, జనవరి 9 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏటీఎం ధ్వంసం చేసి డబ్బులు దోచుకొని దగ్ధం చేయడంతో పాటు వాహనాల దోపిడీకి పాల్పడుతున్న ఏటీఎం దోపిడీ ముఠా లోని ఐదుగురు సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎంల దోపిడీ, వాహనాలు దొంగిలించిన అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు చేదించి అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హాల్ లో శుక్రవారం చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల ను వారు వాడిన మరణాయుధాలు గ్యాస్ కట్టర్లను వివరాలను మీడియాకు చూపించారు. దోపిడి ముఠా వివరాలు సిపి వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన అబ్దుల్లా ఖాన్, శామోద్దీన్, మొహమ్మద్ అజీజ్, వాజిద్ ఖాన్ నలుగురు అంతరాష్ట్ర గ్యాంగ్ సభ్యుల తో కలిసి హైదరాబాద్లోని బేగంపేట్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అమీర్ అన్సారి అనే మరో నిందితుడు ముఠా గా ఏర్పడ్డారు.
ఈ ఐదుగురు సభ్యులు కలిసి గత ఏడాది జూలై 8న షాపూర్ నగర్ ప్రాంతంలోని హెచ్‌ఎఎఫ్సీ, ఏటీఎం, సంగారెడ్డి పరిధిలోని పటాన్చెరు ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొట్టి అందులోని రూ.48 లక్షల నగదు దోచుకుపోయినట్లు సీపీ తెలిపారు. అనంతరం జహీరాబాద్ పరిధిలో బొలరో, టోల్ ప్లాజా వద్ద హుందాయ్ కారు, రెండు వాహనాలను దొంగిలించారు. దొంగిలించిన వాహనాలతో వీరు నిజామాబాద్ వచ్చి జిల్లా కేంద్రంలోని కలిలవాడి ప్రాంతంలో గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను దోచుకునేందుకు యత్నించినట్టు తెలిపారు.
అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది చూసి పోలీస్ టీం లను అప్రమత్తం చేయడంతో వెంబడించినట్లు వెల్లడించారు. గురువారం ఈ ముఠా సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీ పులాంగ్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా పట్టుకోవడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తాము చేసిన దోపిడీలను అంగీకరించినట్లు సీపీ తెలిపారు.
పోలీసులకు పట్టుబడిన ఏటీఎం దోపిడీ ముఠాలోని ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి దొంగిలించిన రెండు వాహనాలతో పాటు అక్సిజన్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, బ్లౌజులు, స్ప్రే తో పాటు ఇనుప రాడ్డు, కటింగ్ ప్లేయర్ ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఏసీపీ రాజా వెంకట పెట్టి, సీసీఎస్ ఇన్చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ, ఒకటో టౌన్ ఎస్ట్రెచ్ ఓ రఘుపతి, సీసీఎస్ సీఐ సాయినాథ్, వన్ టౌన్ ఎస్‌ఐ సుమలత పాల్గొన్నారు.