18-01-2026 03:53:45 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకట రత్నాపూర్ గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ లోని పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం జరిగిందని ఇక మీదట కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు పనిచేస్తామని జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చేదోడు వాదోడుగా నిలిచి పార్టీ మునుగడను ముందుకు తీసుకువెళ్లి దిశగా అడుగులు వేస్తామని వెంకట రత్నపూర్ యువకులు హామీ ఇచ్చారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి, వెంకట రత్నాపూర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి యువకులు ఉన్నారు.