హాస్టల్ గదిలో యువతి సూసైడ్
శేరిలింగంపల్లి,మార్చి 3 (విజయక్రాంతి): మియాపూర్‌లో పండుగ పూట విషాదం చోటుచేసుకున్నది. ప్రేమ వ్యవహారంలో యు వతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కున్నది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నారాయణఖేడ్ గ్రామానికి చెందిన మేఘావత్ సోని బాయి (20) మియాపూర్ మక్త మహబూ పేట్‌లోని ఫస్ట్ హెల్త్ ల్యాబ్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ రెడ్డి ఎన్ క్లవ్‌లో ఉన్న పీజీ హాస్టల్‌లో ఉంటున్నది.
సోనీ ఒక సంవత్సరం నుండి ఫస్ట్ హెల్త్ క్లినిక్ లో పనిచేస్తుండగా సోమవారం పని వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉన్నది. అయితే గది లో ఉన్న తోటి స్నేహితులు మాత్రం ఉద్యగాలకు వెళ్ళిపోయారు. స్నేహాతులు రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ రూమ్‌కు వచ్చి చూసేసరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నా యి. ఎంత పిలిచినా ఉలుకు పలుకులేదు స్నేహితులు, హాస్టల్ యాజమాన్యం కిటికీ లోనుండి చూడగా సోని పైకప్పు ఉక్కుకు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది వెంటనే తలపులు బద్దలు కొట్టి లోప లికి వెళ్లి కిందికి దించి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.
సహచరులు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా తన సొంత గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమె ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




