27 July, 2026 | 12:23 PM

Breaking News

డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •  

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో యువతి మృతి

20-05-2026 01:14 AM

కామారెడ్డి, మే 19 (విజయక్రాంతి): కామారెడ్డి రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ఓ గుర్తు తెలియని యువతి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకున్నట్లు రైల్వే ఎస్త్స్ర లింబాద్రి తెలిపారు. 30 సంవత్సరాల వయసుగల యువతి రైల్వేస్టేషన్ ఆవరణలో వేసిన బల్లపై పడుకుని నిద్రలోనే మృతి చెందినట్లు ఎస్త్స్ర తెలిపారు. యువతి వద్ద ఎలాంటి వివరాలు లేవని ఎక్కడినుండి వచ్చిందో తెలియదని తెలిపారు. యువతికి సంబంధించిన ఎవరైనా వచ్చి గుర్తుపట్టి శవాన్ని తీసుకెళ్లాలని ఎస్త్స్ర తెలిపారు.

మృతి చెందిన యువతి పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు తెలిపారు. అనారోగ్య కారణాలవల్ల మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు. ఫుల్ బ్లూ కలర్ టాప్, బ్లూ అండ్ వైట్ చేక్స్ ఉన్న దుస్తులు ఉన్నట్లు తెలిపారు. టాప్ పై బ్లూ కలర్ షర్ట్, రెడ్ కలర్ చున్నీ ఉన్నట్లు తెలిపారు. బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. యువతి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు, ఐడి కార్డు లేదన్నారు. ఉపదేయాన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్త్స్ర తెలిపారు. సంబంధికులు ఎవరైనా ఉంటే వచ్చి శవాన్ని తీసుకెళ్లాలని కోరారు. కామారెడ్డి రైల్వే పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నది రైల్వే ఎస్త్స్ర లింబాద్రి  తెలిపారు.