యువతికి ప్రాణాంతక మెటబాలిక్ సమస్య
ఆమె ప్రాణాలను కాపాడిన సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
సికింద్రాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌లో వైద్యులు అరుదైన, ప్రాణాంతకమైన యుగ్లైసెమిక్ కీటోఆసిడోసిస్ అనే మెటబాలిక్ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న యువతి ప్రాణాలను విజయవంతంగా కాపాడారు. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా కనిపించడంతో, నిర్ధారణలో ఆలస్యం జరిగే ప్రమాదం ఉంటుంది.రోగిని ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమెకు అల్టర్డ్ సెన్సోరియం, నిద్రమత్తు, తక్కువ గ్లాస్గో కోమా స్కేల్ వంటి లక్షణాలు కనిపించాయి.
అనంతరం పరిస్థితి మరింత విషమించి శ్వాసకోశ వైఫల్యం రావడంతో వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైంది.వైద్య పరీక్షల్లో హై అనియన్ గ్యాప్ మెటబాలిక్ ఆసిడోసిస్‌తో కూడిన యుగ్లైసెమిక్ కీటోసిస్ ఉన్నట్లు నిర్ధారించబడింది.ఈ సమస్య ఒక ప్రత్యేకమైన మందుల ప్రభావంతో ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు.ఇంకా క్లిష్టత ఏమి టంటే, ఆ యువతి ప్రారంభ గర్భధారణ దశ లో ఉండగా గర్భంలో శిశువు మరణించింది.
దీంతో చికిత్స మరింత సవాలుగా మారింది.ఈ అత్యవసర పరిస్థితిలో డాక్టర్ తాజమ్ముల్ సమ్రీన్- గైనకాలజిస్ట్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం- ఇంటెన్సివ్ కేర్, డాక్టర్ ప్రదీప్ కుమార్ మిశ్రా- ఇంటర్నల్ మెడిసిన్, ఐసీ యూ, ఎండోక్రినాలజీ, ప్రసూతి విభాగాల నిపుణు లు కలిసి సమన్వయంతో చికిత్స అందించారు. సమయానికి సరైన నిర్ధారణ, మెటబాలిక్ అసమతు ల్య తను సరిచేయడం, అత్యాధునిక క్రిటికల్ కేర్ వల్ల రోగిని ప్రాణాపాయం నుంచి బయటపడేశారు.
ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని స్థిరంగా ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, యుగ్లైసెమిక్ కీటోఆసిడోసిస్ వంటి సమస్యలు సాధారణ చక్కెర స్థాయిలతో కనిపించకపోవడం వల్ల గుర్తించడం కష్టం. ముఖ్యంగా గర్భిణులు కొన్ని మందులు వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి చికిత్స అందితే ప్రాణాలను కాపాడవచ్చు అని తెలిపారు.ఈ ఘటన మెడికవర్ హాస్పిటల్స్‌లోని అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.






