20 July, 2026 | 6:53 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

రైతు బాగుపడితేనే మీ హోదాకు ప్రత్యేక గుర్తింపు

20-07-2026 01:17 AM

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

మహమ్మదాబాద్ జూలై 19 : రైతు బాగుపడితేనే మీరు పొందిన హోదాకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని నంచర్ల గేటు దగ్గర పల్లవి పాఠశాల ప్రాంగణం నందు ఏర్పాటుచేసిన పిఎసిఎస్ నూతన పాలకవర్గ సభ్యుల సన్మాన సభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రైతులు మీరు చేస్తున్న సేవలను గుర్తించి మరోసారి ఈ హోదాలో వీరే ఉండాలి అనుకునేలా పనులు చేయాలని సూచించారు. కేవలం పదవి పొందితేనే గుర్తింపు రాదని శక్తికి మించి రైతులకు సేవ చేయాలని సూచించారు.

ప్రభుత్వము ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటూ వస్తుందని ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని సూచించారు. ఓటరు నమోదుకు సంబంధించి సర్ ప్రక్రియ జరుగుతుందని ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలన్నారు.  పిఎసిఎస్ చైర్మన్ కమతం శ్రీనివాసరెడ్డి, కమతం విష్ణువర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు  కేఎం నారాయణ, అనంత లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, సర్పంచ్ సంఘాల అధ్యక్షులు   రామ్ లాల్, భగవత్ రెడ్డి, శాంతిరంగ్యా,పిఎసిఎస్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.