18 April, 2026 | 5:25 PM

ఒంటరి మహిళను వేధిస్తున్న యువకుడి అరెస్ట్

04-06-2025 10:03 AM

హైదరాబాద్: సికింద్రాబాద్(Secunderabad) పరిధిలో మహిళను వేధిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు వేధింపులు(Harassing) ఎదురయ్యాయి. గతంలో తనతో సన్నిహితంగా ఉంటూ దిగిన ఫోటోలు బయటపెడతానంటూ యువకుడు బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమామహేశ్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం యువకుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.