calender_icon.png 24 July, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఆపి డబ్బులు డిమాండ్ చేసిన యూత్ కాంగ్రెస్ నేత

24-07-2025 12:58:09 AM

శామీర్ పేట్, జూలై 23: తాము మైనింగ్, ఆర్టీవో అధికారులమని అర్ధరాత్రి లారీలను ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడితోపాటు మరో ఇద్దరిని షామీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కే భానుచందర్, కే వేణు, ఎం రాజు మంగళవారం అర్ధరాత్రి మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ ఎల్లమ్మ గుడి సమీపంలో లారీని అడ్డగించి తాము మైనింగ్, ఆర్టీవో అధికారులమని డ్రైవర్ రామాంజనేయులు తో దురుసుగా ప్రవర్తించారు.

లారీని కర్రలతో కొడుతూ హంగామా చేశారు. డ్రైవర్ను బెదిరించి యజమానితో మాట్లాడంచాలన్నారు. యజమానిని దుర్భసలాడుతూ డబ్బులు డిమాండ్ చేశారు. లారీ యజమాని ఎం రామకృష్ణ, లక్ష్మాపూర్ కు చెందిన అనిల్ అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో నిందితులు డ్రైవర్ రామాంజనేయులను కర్రతో బలంగా చేయిపై కొట్టి గాయపరిచారు. అలాగే మొబైల్ ఫోను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన యజమాని రామకృష్ణ, అనిల్ ను కూడా గాయపరిచారు.

అనంతరం టిప్పర్ లారీ తాళాలు తీసుకుని అప్పటినుంచి పారిపోయారు. నిందితులను గుర్తించి కేసు నమోదు చేశామని, వీరంతా లక్ష్మాపూర్ కు చెందిన వారని పోలీసులు వివరించారు. కాగా భానుచందర్ మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్ అనుచరుడు. వాహనానికి సైరన్ పెట్టుకొని తిరుగుతున్నాడు. చేసుకాకుండా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు.