calender_icon.png 24 July, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం

24-07-2025 12:54:41 AM

- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

- చికిత్స పొందుతున్నవారికి పరామర్శ

ఎల్బీనగర్, జులై 23 : ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రి పాలైన కుటుంబసభ్యులను బుధవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరా మర్శించారు. చింతలకుంటలోని హిమాలయ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఫుడ్ పాయిజన్ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం ఏడుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో ఇద్దరి పరిస్థితి రెండు, మూడు రోజుల్లో మెరుగుపడుతుందని తెలిపారు. అందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. డీఏంహెచ్ వోతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి బాధితుల కు న్యాయం చేయాలని కోరారు. మృతుడు శ్రీనివాస్ ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె పాలిటెక్నిక్, రెండో కుమార్తె పదో తరగతి చదువుతుంది.

మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది 

 ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుందని వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. చింతలకుంట లోని హిమాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్, ఆయన బామ్మర్ది కుటుంబ సభ్యులను కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు పరామర్శించారు. విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియజేశామని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. వీరి వెంట ఆర్టీసీ కాలనీ ప్రెసిడెంట్ ముకుంద, మల్లికార్జున నగర్ కాలనీ అధ్యక్షుడు నిరంజన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రకాశ్ తదితరులుఉన్నారు. వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి