24-07-2025 12:58:17 AM
వణికిన ఏజెన్సీ...
వెంకటాపురం నూగూరు, జూలై 23( విజయ క్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వెంకటాపురం మండలం అతలాకుతలమైంది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వాన బుధవారం సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయానికి 12 గంటల వ్యవధిలో సుమారు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు తోడు ఉరుములు మెరుపులతో మండలం దద్దరిల్లిపోయింది.
ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమంతా వర్షాలు పడ్డ కేవలం వెంకటాపురం మండలంలోని జిల్లాలోని అత్యధిక స్థాయి వర్షపాతం నమోదు కావడం విశేషం. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని కంకల వాగు పాలెం వాగు కుక్కతోరి వాగు రాళ్లవాగు కొండాపురం వాగులు పొంగి పొర్లాయి.
మండల పరిధిలోని ఏకన్నగూడెం గ్రామ సమీపంలోని ఇసుక వాగు వద్ద డైవర్షన్ రోడ్డు తెగిపోయి రహదారి సౌకర్యం ఆ వైపుగా పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలెవరు అటువైపుగా ప్రయాణాలు చేయవద్దని సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఎస్త్స్ర కే తిరుపతిరావు హెచ్చరించారు.
రహదారికి అడ్డంగా పోలీస్ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఓడబల్జ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ పిలుపునిచ్చారు.
18.1 అడుగులకు చేరిన పాకాల సరస్సు
వరంగల్: (జులై 23, విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సరస్సులోకి క్రమంగా వరద వస్తోంది. వారం క్రితం వరకు పాకాల సరస్సులో 17.6 అడుగుల నీరు ఉండేది. బుధవారం ఉదయానికి 18.1 అడుగులకు చేరుకుంది. పాకాల కింద సుమారు 20 వేలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ వర్షాలకు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాళ్ళవాగు ను పరిశీలించిన కలెక్టర్ దివాకర..
వెంకటాపురం నూగూరు, జూలై 23( విజయ క్రాంతి): జిల్లా, మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమన్వ యంతో పనిచేసి ఏటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. బుదవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల యాకన్న గూడెం రాళ్ళ వాగు వద్ద ములుగు, భద్రాద్రి కొత్తగూడెంజిల్లా సరిహద్దుల్లోమరమ్మతులకు గురైన వంతెనను కలెక్టర్ దివాకరటి.ఎస్. పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ కురిసిన అధిక వర్షాలతోరాళ్లవాగు సమీపంలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి వరద నీటి ప్రవాహంతో కొట్టుకుపోయిందని, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిందని తెలిపారు. వచ్చేమూడు రోజులలో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
వాగులు, వంకలు, చెరువులు,గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహించే అవకాశం ఉందని,వరద నీరు చేరి రోడ్లు పై వచ్చినప్పుడు ప్రజలు, వాహనాదారులు అప్రమత్తంగాఉండాలని సూచించారు.
అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని, గోదావరి ముంపు ప్రాంతాలలోఉన్న ప్రజల సౌకర్యార్థం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధి కారి సంజీవ రావు, మండల అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వెంకటాపురం నూగూరు, జూలై 23( విజయ క్రాంతి): ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బ్రదర్ అంతా అప్రమత్తంగా ఉండాలని వెంకటాపురం ఎస్‌ఐ తిరుపతిరావు ప్రజలను హెచ్చరిం చారు. గత 24 గంటల నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా యని, మరో వారం రోజులు ఇదేవిధంగా భారీ వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ చెబుతున్నది అన్నారు.
కావున మండల ప్రజలు ఎవరూ అత్యవసరం అయితే తప్ప బయటకి రావొద్దని సూచించారు. ప్రజలు ఎటువంటి సహాయం అవసరం అయినా వెంటనే వెంకటాపురం పోలీస్ వారిని సంప్రదించాలన్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
కన్నాయిగూడెం,జూలై23(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ప్రజలకు మరియు రైతులకు మా పోలీసు వారి నుండి చేయు ముఖ్య సూచన ఏమనగా రానున్న రెండు మూడు రోజుల్లో మన ప్రాంతానికి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున అవసరముంటే మాత్ర మే ఇంటి నుండి బయటకు రావాలని కరెంటు స్తంభాలు పక్కన ఉన్న తీగలును ఐరన్ తీగలు పొరపాటున ముట్టుకోవద్దు.
తీవ్ర వర్షాలు కారణంగా ఎవరు అయినా పాత ఇంట్లో నివసిస్తుంటే ఈ వర్షానికి నాని కూలెందుకు అవకాశం ఉన్నందున ఈ ఇళ్లను ఖాళీ చేయగలరు తీవ్రమైన వర్షం వలన వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అట్టి ప్రాంతాల్ని ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకి వచ్చి ఉండాలని అనవసరంగా వాగులుని దాటవద్దు ఎక్కడైనా రోడ్ల మీదకి నాళాలు పొంగి ప్రవహిస్తుంటే దాని పైనుండి ఎవరు .
దాటవద్దు అలాగే అలా ప్రవహిస్తున్న నాళాల గురించి,అత్యవసరం ఐతే కన్నాయిగూడెం పోలీస్ వారి ప్రత్యేక బృందాలు 24గంటలు అందుబాటులో ఉంటారు కావున కన్నాయిగూడెం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్లు కన్నాయిగూడెం ఎస్‌ఐ 8712670089 కన్నాయిగూడెం పోలిస్ స్టేషను నంబర్ 8712670139 ఇవ్వాలని అన్నారు.
ఇండ్లలోకి చేరిన నీరు
ములుగు,మంగపేట,జూలై23(విజయక్రాంతి):ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఇండ్లలోకి నీరు వచ్చింది డ్రైనేజీలు లేక సైడ్ కాలువల నుంచి నీళ్లు సరిగ్గా వెళ్ళకపోయి కొన్ని రోజుల క్రితం వేసిన రోడ్డు సైడ్ పక్కన వేసిన తూములలో నుంచి కూడా నీళ్లు వెళ్ళక,
పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది సంబంధించిన అధికారి స్పందించి ఎస్సీ కాలనీలో చొరవ తీసుకొని సైడ్ డ్రైనేజీలు కాలువలు తూములులలో నించి నీళ్లు వెళ్లే విధంగా చేయాలని గ్రామస్తులు కోరుతున్నాము.