23 June, 2026 | 6:32 PM

రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: మీడకంటి వెంకటరెడ్డి

23-06-2026 05:39 PM

ఖమ్మం రూరల్,(విజయక్రాంతి): రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని, ఖరీఫ్ రైతు భరోసా నిధులను ఒకే దఫాలో విడుదల చేయాలని కోరారు. పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించి, నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రూపాయలకు పైబడిన వ్యవసాయ రుణాలను కూడా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వో వినయేందర్ రెడ్డికి అందజేశారు.