రాజకీయాల్లో యువశక్తికి పెద్దపీట వేయాలి
- ‘జై జవాన్‌జై కిసాన్‌జై యువ’ నినాదానికి మద్దతు
- ఎన్నికల్లో పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గించాలి: మొగుళ్ల రాజిరెడ్డి
ముషీరాబాద్, జూలై 28(విజయక్రాంతి): రాజకీయ వ్యవస్థలో యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు ఐఎన్టీయూసీ ముఖ్య ఉపాధ్యక్షులు, జలమండలి ఎంప్లాయీస్ యూని యన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన ‘జై జవాన్‌జై కిసాన్‘ నినాదానికి ఇప్పుడు ‘జై జవాన్‌జై కిసాన్‌జై యువ‘ను జోడించడం యువత అభ్యున్నతి పై కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువశక్తిని రాజకీయ వ్య వస్థలో భాగస్వామ్యం చేస్తే భారతదేశం మ రింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజిరెడ్డి సమర్థించారు. రాజీవ్ గాంధీ హ యాంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓ టు హక్కు వయస్సును 21 నుంచి18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేసిన రాజిరెడ్డి, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యానికి కూడా అదే దిశగా మార్పులు అవసరమని పేర్కొన్నారు. ఎమ్మె ల్యే, ఎంపీగా పోటీ చేసే కనీస వయ స్సును 21 ఏళ్లకు తగ్గించాలని తీర్మానం చేయనున్నట్లు సీఎం ప్రకటించడం స్వాగతించదగ్గ నిర్ణయమని రాజిరెడ్డి అన్నారు.






