11 April, 2026 | 7:06 PM

యువత రాజకీయాల్లో రాణించాలి

08-12-2024 02:01 AM

ఎంపీ మల్లు రవి 

వనపర్తి, డిసెంబర్ 7 (విజయక్రాంతి): యువత విద్యతో పాటు రాజకీయల్లోనూ రాణించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో జోగుళాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరుమలేశ్ గెలు పొందారు. శనివారం నూతన అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యుల విజయోత్సవ ర్యాలీ నిగద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి సరితతో కలిసి ఎంపీ మల్లు రవి ప్రారంభించారు. అనంతరం కార్యవర్గ సభ్యులను సన్మానించి, మాట్లాడారు. యువజన కాంగ్రెస్ నాయకు లు పార్టీకి పట్టుకొమ్మలన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు తిరుమలేశ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవి అవకాశం కల్పించిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు.