రేపటి నుంచి గ్రూప్ హాల్‌టికెట్లు
08-12-2024 02:03 AM
- 15, 16 తేదీల్లో పరీక్షలు
- ఏర్పాట్లు చేస్తున్న టీజీపీఎస్సీ
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): గ్రూప్ పరీక్షల నిర్వహ ణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి గ్రూప్ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని శనివారం ప్రకటనలో తెలిపింది. ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాలను ఏర్పా టు చేశారు.
ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల లోపు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటలలోపే అభ్యర్థుల ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా ఈ పరీక్షలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.




