23 May, 2026 | 6:37 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలి

23-05-2026 05:45 PM

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాట్రన్ మెంబర్‌గా డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి కి సన్మానం

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సేవా సంస్థ “ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ”లో స్థానిక ఆర్.కె. విద్యాసంస్థల సీఈఓ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి పాట్రన్ మెంబర్‌గా (రూ.25,000 సభ్యత్వం) చేరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ డాక్టర్ జైపాల్ రెడ్డిని శాలువాతో సత్కరించి సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి అభినందించారు. ఎం. సదాశివ రెడ్డి రెడ్ క్రాస్ సొసైటీలో వైస్ పాట్రన్ సభ్యత్వం (రూ.12,000) స్వీకరించగా, కలెక్టర్ వారికి మెమెంటోను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజ సేవలో విశేష పాత్ర పోషిస్తున్న డాక్టర్ జైపాల్ రెడ్డి వంటి వ్యక్తులు రెడ్ క్రాస్ వంటి అంతర్జాతీయ గుర్తింపు కలిగిన సేవా సంస్థలో సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమన్నారు.

జిల్లాలోని యువత తమ విలువైన సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యువత, విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.

ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు సేవలందించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలోని ప్రముఖులు, యువత, విద్యార్థులు కూడా రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ గిరి, రెడ్ క్రాస్ నోడల్ అధికారి శశికుమార్, డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి, మర్రి సదాశివ రెడ్డి, దత్తాద్రి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.