15-10-2025 07:03:07 PM
కమిషనర్ రమేష్..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.. సెల్ ఫోన్లు విడాలని.. ప్రతిరోజు క్రీడల్లో పాల్గొనాలని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్,మై భారత్ పెద్దపల్లి జిల్లా స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ సుల్తానాబాద్ ఆధ్వ ర్యంలో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో బుధవారం బ్లాక్ స్థాయి క్రీడాపోటీలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే పోటీలను సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ ముఖ్య అతిధిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు పదార్థాలను వీడాలని యువ క్రీడాకారులు ఏ మేరా యువ భారత్ క్రీడా పోటీలను వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేందుకు ఏదో ఒక క్రీడను అలవర్చుకోవాలన్నారు. మేరా యువ భారత్ క్రీడా పోటీలను వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలురకు వాలీబాల్, కబడ్డీ, షటిల్ బాడ్మింటన్, చెస్, 400 మీటర్ల రన్నింగ్, షాట్పుట్ పోటీలు నిర్వహించారు. క్రీడల్లో పాల్గోన్న క్రీడాకారులను ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జి, శ్రీధర్ పెద్దపెల్లి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రెటరీ ముత్యాల రవీందర్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పలు క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్య క్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సెక్రటరీ అమీర్ శెట్టి తిరుపతి, గట్టపల్లి హై స్కూల్ పి డి ప్రణయ్, మై భారత్ పెద్దపల్లి ఇంచార్జి మహేశ్, వెంకటేష్ ఫిజికల్ డైరెక్టర్ సతీష్ అజ్జు సత్యం, క్రీడాకారులు పాల్గోన్నారు.