calender_icon.png 16 October, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన అనుష్కకు అభినందనలు..

15-10-2025 07:06:03 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ యం, అనుష్క రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. మంగళవారం కరీంనగర్ లోని ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీ ఆవరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల స్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 ఖోఖో పోటీలు నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఈసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ అనుష్క వాలీబాల్ లో ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని స్పోర్ట్స్, గేమ్స్ ఇంచార్జి కె.సునీల్ తెలిపారు. విద్యార్థినినీ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్ విద్యార్థిని అభినందిస్తూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జాతీయస్థాయికి ఎదగాలని అభినందిస్తూ సన్మానిచారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాధవిలత, దేవేందర్, ప్రభాకర్, విక్రమ్, అర్జున్, హరికృష్ణ, రాజశేఖర్, రాజేందర్, అర్జున్, నిర్మల, వంశి, మమత పలువురు అనుష్కను అభినందించారు.