calender_icon.png 19 November, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ

17-11-2025 12:34:58 AM

త్రినాథ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్‌లైన్. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాహితీ అవాంఛ హీరోయిన్‌గా నటించింది.

తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీప్రసాద్, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేశ్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేశ్ ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుండగా, ఆంధ్ర, సీడెడ్‌లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ చిత్రానికి సంగీతం: ఆర్‌పీ పట్నాయక్; డీవోపీ: జగదీశ్ చీకటి; ఎడిటర్: ఉద్ధవ్ ఎస్‌బీ.