23 July, 2026 | 12:55 AM

విద్యార్థులకు వైఆర్పీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్

23-07-2026 12:24 AM

187 మందికి రూ.74 లక్షలు

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): వైష్ణోయి గ్రూప్, వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ ఆధ్వ ర్యంలో హైదరాబాద్‌లోని వైష్ణోయి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 2026 విద్యా సంవత్సరానికి 187 మంది ప్రతిభావంతులైన విద్యా ర్థులకు రూ.74 లక్షల స్కాలర్షిప్స్ అందజేశారు. 2022 నుంచి ఇప్పటివరకు ఫౌండేష న్ ద్వారా 680 మందికి పైగా విద్యార్థులు విద్యా సహాయం పొందారు.

కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, డా. జె. పూర్ణచంద్రరావు (రిటైర్డ్ ఐపీఎస్), ఎం. జగదీశ్వర్ (రిటై ర్డ్ ఐఏఎస్) గౌరవ అతిథులుగా పాల్గొన్నా రు. హైదరాబాద్, నల్లగొండతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, పాఠశాల, నర్సరీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు.