బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం

23-04-2024 02:10:26 AM

అభ్యర్థి గాలి అనిల్‌కుమార్

నారాయణఖేడ్, ఏప్రిల్ 22 (విజయక్రాం తి) : ఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మాజీ ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ఆదివారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్ గెలుపొందడం ఖాయమన్నారు. తాము చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు తమ పార్టీ అభ్యర్థి గాలి అనికుమార్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలుపించాలని కోరారు. 

అనంతరం ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే సొంత నిధులతో పేదల పెండ్లిళ్లకు మూడు ప్రత్యేక ఫంక్షన్ హాల్స్ కట్టించి ఉచితంగా ఇస్తామన్నారు. ర్యాలీ కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే కూతురు శ్రేయరెడ్డి, జడ్పీటీసీ ఆంజనేయులు,  ఎంపీపీ వెంకట్‌రెడ్డి, మండల అధ్య క్షుడు గంగారాం, మాజీ సర్పంచ్‌లు కృష్ణాముదిరాజ్, సిద్దుపాటిల్, ఎంపీటీసీ అంబాజి, సాయిలు, సంజు, బస్వరాజ్, రఘునాథ్ పాల్గొన్నారు.