గద్వాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
15-08-2026 12:00 AM
గద్వాల టౌన్, ఆగస్టు 14 : గద్వాల పట్టణంలోని స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఏఎల్డీ కళాశాల నుంచి పాత బస్టాండ్,కృష్ణవేణి చౌక్, రాజీవ్ మార్గ్ మీదుగా ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, దేశ సమగ్రత,ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, శివారెడ్డి, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






