నిర్మల్ డిఎం కు వినతి పత్రం
నిర్మల్ నవంబర్ 27 ( విజయ క్రాంతి): నిర్మల్ డిపో(Nirmal Depot) పరిధిలోని బస్సులు, బస్టాండ్ ప్రాంగణాలు, ప్లాట్‌ఫామ్‌లు (Platforms) మరియు సైన్ బోర్డులపై తెలుగుతో పాటు ఉర్దూ, ఆంగ్ల భాషలను కచ్చితంగా రాయాలని కోరుతూ శుక్రవారం ఆర్టీసీ డిపో మేనేజర్ (RTC Depot Manager) కల్పనకు వినతిపత్రం సమర్పించారు.
కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా వ్యవస్థాపకులు అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ ఆదేశాల మేరకు నాయకులు ఈ వినతి అందించారు. ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో సూచనలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలిపారు.
డీఎం కల్పన ఉన్నతాధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇంతియాజ్, జిల్లా కోశాధికారి శేఖ్ షాదుల్లా హుస్సేన్, పట్టణ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ కరీం, పట్టణ యువజన విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ మోసిన్, తాజీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.