సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందించాలి

04-11-2026 | 06:57pm

నిర్మల్ నవంబర్ 4 ( విజయ క్రాంతి): జిల్లాలోని ప్రతి అర్హులైన చిన్నారికి ప్రభుత్వ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందించాలని జిల్లా వైద్య(District Medical) మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్(Health Department official Dr. Rajender) వైద్య సిబ్బందిని ఆదేశించారు. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం Muzgi పరిధిలోని మంజులాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో  నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును,  టీకాల రిజిస్టర్లను, లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమం నిర్వహణ అధికారి డాక్టర్ సౌమ్య, డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు సునీత తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు