విజ్ఞాన విహార యాత్రలో విద్యార్థులు

28-10-2026 | 09:23pm

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసీ) విద్యార్థులు బుధవారం విజ్ఞాన విహార యాత్ర(Educational Excursion)లో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project)ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రాజెక్టు నిర్మాణం, దాని ప్రాముఖ్యత, సాగునీటి అవసరాల కోసం నీటి వినియోగం తదితర అంశాలపై గైడ్ ఉపాధ్యాయులు రాకేష్, కిశోర్, అర్షద్, రాజన్న అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థులు ప్రాజెక్టు పరిధిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని(Power generation plant) సందర్శించి, విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ విహారయాత్ర దోహదపడింది. ఇలాంటి విద్యా విహారయాత్రలు విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించడంతో పాటు, కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తిని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు