ముగిసిన కోల్ క్వాలిటీ అవెర్నెస్ వీక్

18-11-2026 | 05:09pm

ద్వితీయ బహుమతి సాధించిన శ్రీరాంపూర్ 

శ్రీరాంపూర్, (విజయక్రాంతి) : కోల్ క్వాలిటీ అవేర్నెస్ వీక్ లో(Coal Quality Awareness Week) భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి 18 వరకు బొగ్గు నాణ్యతపై క్షేత్రస్థాయినుంచి అన్ని ఏరియాల గనులు, కార్యాలయాలు, విభాగాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

కోల్ క్వాలిటీ అవేర్నెస్ వీక్ ముగింపు వేడుకలు బుధవారం క్వాలిటీ మేనేజ్ మెంట్ జీఎం ఎ రవికుమార్ అధ్యక్షతన ఆర్జీ 1 ఏరియా పరిధిలోని గోదావరిఖని ఇల్లందు క్లబ్ లో నిర్వహించారు. బొగ్గు నాణ్యత ప్రాధాన్యత, వినియోగదారుల ఆకర్షణపై జరిగిన కార్యక్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరం బొగ్గు నాణ్యత బహుమతులు ప్రధానోత్సవం నిర్వహించారు.

78.85 శాతం గ్రేడ్ సాటిస్ఫాక్షన్ తో సింగరేణిలోని అన్ని ఏరియాలలో శ్రీరాంపూర్ ఏరియా రెండవ స్థానంలో నిలవగా ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే వెంకటేశ్లర్లు చేతుల మీదుగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, ఏరియా అధికారులతో కలిసి బహుమతి స్వీకరించారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ యాజమాన్యం సూచనల మేరకు సింగరేణిలోనే శ్రీరాంపూర్ ఏరియా క్వాలిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.  2024-25లో మొదటి బహుమతి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెండవ బహుమతి పొందటం ఆనందంగా ఉందన్నారు. ఈసారి సమిష్టి కృష్టితో మళ్లీ శ్రీరాంపూర్ ఏరియాను మొదటి స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఎస్ఆర్పీ ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, సీహెచ్పీ ఇంఛార్జ్ చంద్రలింగం, శ్రీరాంపూర్ ఏరియా క్వాలిటీ ఇంఛార్జ్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు