సుల్తానాబాద్ లో శివుడికి ఘనంగా రుద్రాభిషేకం
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు...
సుల్తానాబాద్ నవంబర్ 29 (విజయక్రాంతి): కార్తీక మాసం ను పురస్కరించుకొని ఆదివారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయంలో(Shiva Temple) స్వామివారికి సామూహిక రుద్రాభిషేకం వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతరం వీరభద్ర స్వామి వార్షికోత్సవ వేడుకలు, శివుడికి అన్న పూజ, మహా నైవేద్యం, అమ్మవారికి ఓడి బియ్యం, హారతి మంత్రపుష్పం, అనంతరం అన్న ప్రసాద వితరణ (అన్నదాన) కార్యక్రమం నిర్వహించారు. శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు, అర్చకులు వల్లకొండ మఠం రమేష్ శైలజ, మహేష్ రజిత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి, ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున భక్తులు(Devotees) పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.