కోనరావుపేట నుంచి 250 మంది బీజేపీలో చేరిక

21-11-2026 | 10:43pm

కోనరావుపేట నవంబర్ 21 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని(Konaraopeta Mandal) అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో(Bharatiya Janata Party) చేరారు.మోతుకు భాను ఆధ్వర్యంలో సుమారు 250 మంది బీజేపీలో చేరగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో  చెన్నమనేని వికాస్ రావు, గోపాడి సురేందర్ రావు, గొట్టే రాంచందర్, మోతుకు మోహన్, జింక వెంకటి, వెలిశాల రవీందర్, ఆకుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు