మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గానికి ఘన సన్మానం
రైతుల పంటల కొనుగోలులో కీలక పాత్ర పోషించిన పాలకవర్గం.
కోనరావుపేట నవంబర్ 21 (విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopeta Mandal) కేంద్రంలోని మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గాన్ని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బోయిని దేవరాజ్ ముదిరాజ్ ఘనంగా సన్మానించారు.రెండు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి విశేష కృషి చేసిందని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా బోయిని దేవరాజ్ మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల పంటలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
రైతులకు అండగా నిలిచి వారి పంటల కొనుగోలుకు సహకరించిన పాలకవర్గం సేవలను కొనియాడారు.వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన సూచనల మేరకు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యేలా పాలకవర్గం కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.