ప్రతిజ్ఞ దివాస్ వేడుకలు

21-11-2026 | 06:01pm

చుంచుపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఒకేషనల్ కళాశాలలో స్వేరోస్ సుప్రీం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా ప్రతిజ్ఞ దివాస్ (Pratigna Diwas) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా జంపన్న ఆధ్వర్యంలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు (Essay Writing Competitions) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రవి, వైస్ ప్రిన్సిపాల్ ఉషారాణి, లెక్చరర్ స్వామి, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు