ముబారక్‌పూర్‌లో పశువులకు ఉచిత వైద్యం

21-11-2026 | 05:58pm

సిర్గాపూర్, నవంబర్ 21 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని చిన్న ముబారక్‌పూర్ గ్రామంలో శనివారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం (Free Veterinary Camp) నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని పశువులకు గర్భస్థ పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు (Medical Checkups) నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

అలాగే దూడలకు నట్టల నివారణ మందులు (Deworming Medicine) అందజేసినట్లు మండల పశువైద్య అధికారిణి డాక్టర్ జె.సి. క్రాంతి తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వ్యాధుల నివారణకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రోళ్ల సాయిలు, మాజీ సర్పంచ్ మధు స్వప్న, గోపాలమిత్ర సూపర్‌వైజర్ తుక్కా రెడ్డి, గోపాలమిత్రులు మల్లేశం, సుమంత్, నగేష్, రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు