పోల్ టు పోల్: విద్యుత్ సమస్యలపై SE శ్రీనివాస్ రావు ఆరా

21-11-2026 | 05:52pm

ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలి.

కోనరావుపేట నవంబర్ 21 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో(Konaraopeta Mandal) నిర్వహించిన పోల్ టు పోల్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఈ ఎం. శ్రీనివాస్ రావు(SE Srinivas Rao) క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ సిబ్బందితో(Electricity department staff) మాట్లాడారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని విద్యుత్ సమస్యలను(Electrical problems) పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ట్రాన్స్‌ఫార్మర్లపై(Transformers) ఓవర్‌లోడ్ ఉన్నట్లయితే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, ఓవర్‌లోడ్‌తో ఉన్న 11కేవీ విద్యుత్ లైన్లను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అలాగే వదులుగా ఉన్న విద్యుత్ తీగలను గుర్తించి వాటిని సరిచేయాలని సూచించారు.విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, విద్యుత్ పనులు చేపట్టే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సిబ్బందికి క్యాప్స్ పంపిణీ చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్ఈ శ్రీనివాస్ రావు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈ విద్యుత్ సిబ్బంది తదితరులు వున్నారు.

మరిన్ని వార్తలు