ఆదివాసి గుస్సాడీ ఉత్సవాల ఆర్థిక సాయం అందించండి

21-11-2026 | 06:00pm

బోథ్. నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి గుండెలలో నిర్వహించిన ఆర్థిక సహాయాన్ని(Financial assistance) వెంటనే అందించాలని ఆదివాసి తుడుం దెబ్బ సోనాల మండల కన్వీనర్ రాయి సీడం జాకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుసడి ఉత్సవాల కోసం ప్రభుత్వం 15000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుందని ఇంతవరకు అందుకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. మండలంలోని పార్టీకి గ్రామానికి మాత్రమే ఎంపీ నగేష్(MP Nagesh) చేతుల మీదుగా చెక్కును ఇవ్వడం జరిగిందని మిగతా 17 గూడాలకు ఇంతవరకు పంపిణీ చేయలేదని వాపోయారు. పండుగ ముగిసి పోయిన ఇంతవరకు నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు