ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా

21-11-2026 | 06:15pm

రామారంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ప్రారంభం

అర్హులందరికీ బీమా రక్షణ కల్పించాలి: కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, నవంబర్ 21 ( విజయక్రాంతి): ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించి అండగా నిలవడమే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం(‘Indiramma Family Life Insurance’ Scheme) ప్రధాన లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(Narsampet MLA Donthi Madhava Reddy) అన్నారు. శనివారం నర్సంపేట మండలం రామారంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ఇంటి పెద్దకు అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఆ కుటుంబం వీధిన పడకుండా జీవిత బీమా ద్వారా రక్షణ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.

ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ. 18 నుంచి 59 ఏళ్ల వయసు గల కుటుంబంలో సంపాదించే వ్యక్తిని అర్హులుగా గుర్తించి, డిసెంబర్ 18 లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ వార్డుల్లో నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్, రేషన్ కార్డు, నామినీ వివరాలను పక్కాగా ఆన్‌లైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వసంత, డీపీవో కల్పన, ఆర్డీవో ఉమారాణి, ఎంపీడీవో శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు