మహిళ, 15 నెలల బాలుడు అదృశ్యం
05-11-2026 | 11:32pm
భర్త ఫిర్యాదుతో కేసు నమోదు
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్నసిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంటాల గ్రామానికి చెందిన బందెల నవిత (29) తన 15 నెలల కుమారుడు హిమన్షుతో కలిసి అదృశ్యమైంది. ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటలకు భర్త ప్రశాంత్‌తో చిన్నపాటి గొడవ జరగడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో భర్త ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ, బాలుడి ఆచూకీ తెలిసిన వారు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.