ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రదర్శనలు

13-11-2026 | 05:09pm

చందుర్తి,నవంబర్ 13,(విజయక్రాంతి) : గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం(Rural Agricultural Work Experience Programme) (RAWEP)లో భాగంగా వ్యవసాయ విద్యార్థులు(Agriculture students) చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ‘రైతు సదస్సు(Farmers' Conference) – 2026’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సస్యరక్షణ, సేంద్రియ వ్యవసాయ విధానాలపై స్వయంగా రూపొందించిన నమూనాలను ప్రదర్శించి రైతులకు వివరించారు.

అలాగే RAWEP కార్యక్రమంలో భాగంగా గత నాలుగు నెలలుగా గ్రామాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలు, రైతులతో అనుబంధం, అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక వీడియో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మూడపల్లి మరియు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రదర్శనలను తిలకించడంతో పాటు విద్యార్థులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు విద్యార్థుల కృషి, ప్రతిభను అభినందిస్తూ ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పరిజ్ఞానాన్ని చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సాయి కుమార్, గ్రామ సర్పంచ్ చిలుక మల్లీశ్వరి ,అసోసియేట్ డీన్ డాక్టర్ జె. సురేష్, వ్యవసాయ అధికారి దుర్గారాజ్, అధ్యాపకులు బి. శ్వేత, రజియా సుల్తానా, సతీష్, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, పాక్స్ చైర్మన్ లు గసికంటి ప్రభాకర్, ఎగోళం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు