అక్రమ నిర్మాణాల ‘దందా’

30-10-2026 | 05:20am
  1. చేతివాటం ప్రదర్శిస్తున్న చైన్‌మన్లు 
  2.  క్షేత్రస్థాయిలో నోటీసుల పేరుతో బేరసారాలు
  3. అధికారుల అండతో జీహెచ్‌ఎంసీ ఆదాయానికి భారీగా గండి
  4. ఏటీఎంలుగా మారుతున్న అప్రకటిత కమర్షియల్ షెడ్లు

ఎల్బీనగర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గంలో అక్రమ వసూళ్ల దందా(Illegal collection racket) జోరుగా కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, క్షేత్రస్థాయి సి బ్బంది అక్రమార్కులతో చేతులు కలపడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అడ్డుకుని, నిబంధనలను పక్కనపెట్టి సొంత జేబులు నింపు కోవడానికే పెద్దపీట వేస్తున్నారు. నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిన వారే, ఆ నోటీసులనే అడ్డం పెట్టుకుని బహిరంగ బేరసారాలకు దిగుతున్నారు.

చైన్‌మన్లు బాధ్యత మరిచి ‘దందా’..

ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్, నాగోల్ సర్కిళ్లలో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు చైన్ మ న్లకు అదనపు ఆదాయ మార్గంగా మారా యి. ఒక్కో సర్కి ల్ పరిధిలో ఉం డే ముగ్గురు లేదా నలుగురు చైన్‌మన్లు తమకు కేటాయించిన కాలనీల్లో జరిగే అనధికార నిర్మా ణాలు, భూ సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆధారాలతో సహా టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రాథమిక బా ధ్యత వీరిదే. అయితే, ఈ బాధ్యతను పూర్తి గా విస్మరించి, నిబంధనలకు విరుద్ధంగా క డుతున్న భవనదారులకు వీరే పూర్తి రక్షణగా నిలుస్తున్నారు.

నివాస అనుమతులతో కమర్షియల్ నిర్మాణాలు..

ఆయా డివిజన్లలో రెసిడెన్షియల్ అనుమతులు (జీ+2, జీ+3) పొంది, అదనపు అంత స్తులు వేస్తూ కమర్షియల్ భవనాలుగా మా రుస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీటిని గుర్తించాల్సిన అధికారులు సైతం వంత పాడుతుం డటంతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గం డి పడుతోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం పేరుకే తూతూమంత్రంగా నోటీసు లు జారీ చేస్తూ, అక్రమ నిర్మాణదారులను బెదిరించి ఆపై అందినకాడికిదండుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాన రహదారుల్లో వెలుస్తున్న షెడ్లు..

నియోజకవర్గంలోని కీలక రవాణా మా ర్గాల్లో అక్రమనిర్మాణాలు రాజ్యమేలుతున్నాయి. 

ముఖ్యంగా:

ఎల్బీనగర్  చంపాపేట రహదారి

ఎల్బీనగర్  నాగోల్ రహదారి

ఎల్బీనగర్  హయత్ నగర్

బీఎన్ రెడ్డి నగర్  జడ్పీ రోడ్డు (హస్తినాపురం)

వనస్థలిపురం  బీఎన్ రెడ్డి నగర్ రహదారుల ప్రాంతాల్లో వ్యాపార కాంప్లెక్సులు, అనధికార కమర్షియల్ షెడ్లు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా వెలుస్తున్నాయి. చైన్‌మన్లకు ఈ అక్రమ షెడ్లు ‘ఏటీ ఎమ్‘లుగా మారాయని, డబ్బులు ఇస్తే సక్రమమని, ఇవ్వకపోతే అక్రమమని భవన యజమానులతో బేరసారాలు సాగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

స్పందించని టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు..

అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతు న్నా అసిస్టెంట్ సిటీ ప్లానర్లు (ఏసీపీ), ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు అందినప్పటికీ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు విజయలక్ష్మి, అంబికా, ప్రతాప్లతో పాటు సంబంధిత టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. భవన నిర్మాణాలు పూర్తయ్యేంతవ రకు వేచి చూసి, చివరి నిమిషంలో నోటీసు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు