భూ సేకరణకు రైతులు సహకరించాలి
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
- ఐదు గ్రామాల రైతులతో మూసీ భూ సమీకరణపై అవగాహన సదస్సు
అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 28 : మూసీ నది పరివాహక(Musi River catchment area) ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టనున్న భూ సమీకరణకు రైతులందరూ సహకరించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి(MLA Malreddy Rangareddy) కోరారు. రైతులకు తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల పరిధిలోని గౌరెల్లి గ్రామంలోని పీఎంఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టనున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అంశంపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, తిమ్మాయిగూడ, గౌరెల్లి, బాచారం గ్రామాలకు చెందిన రైతులకు భూ సమీకరణ ప్రక్రియ, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి లక్ష్యాలపై అధికారులు అవగాహన కల్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి రైతులు సహక రించాలని కోరారు. భూ సమీకరణలో రైతు ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారికి తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్ర హీంపట్నం ఆర్డీవో వై. శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ జానకి, ఆర్ఐ రాంబాబు, జీపీఓలు రాకేష్, శరత్ చంద్ర, కవితారాణి, అంజయ్య, తిరుమలయ్య, శ్రీపతిరాణితో పాటు ఐదు గ్రామాలకు చెందిన రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.