విద్యార్థులు ఆటల్లో రాణించాలి

27-11-2026 | 11:10pm

మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి 

ఎల్బీనగర్, నవంబర్ 27 : విద్యార్థులు(Students) చదువుతోపాటు ఆటల్లో రాణించాలని హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి(Former Hayathnagar Corporator Navajeevan Reddy) పిలుపునిచ్చారు. హయత్‌నగర్‌లోని ఆర్టీసీ మజ్దూర్ కాలనీలో(RTC Mazdoor Colony) ఎన్జీవో అకాడమీ ఆధ్వర్యంలో అండర్-17 కబడ్డీ టోర్నమెంట్‌(Kabaddi Tournament) నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల పరిధిలోని మొత్తం 28 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి  నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి, ప్రతిభావంతులైన క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. యువత చదువుతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్,  నాయకలు ఇట్టబోయిన నర్సింహ, సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు