ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?
రక్తమోడుతున్న షాద్‌నగర్ రహదారులు
నిత్యం ప్రమాదాలతో ప్రజల్లో గుబులు
ఆక్రమణలతో కుంచించుకుపోయిన రోడ్లు.. కరువైన ట్రాఫిక్ నియంత్రణ
షాద్‌నగర్ టౌన్, నవంబర్ 16 (విజయక్రాంతి): షాద్‌నగర్ పట్టణ(Shadnagar town) రహదారులు మృత్యుపాశాలుగా(Roads are death traps) మారుతున్నాయి. మహబూబ్‌నగర్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, పరిగి రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్లపై(Railway station roads) నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మొద్దునిద్ర వీడకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆదివారం రాత్రి పట్టణంలోని పాత జాతీయ రహదారిపై(National Highway) రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగర్‌గూడ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే విద్యార్థి స్థానిక బీసీ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. పని నిమిత్తం నడుచుకుంటూ రోడ్డు దాటు తుండగా వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ప్రమా దం జరిగిన వెంటనే బైక్‌దారుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ప్రణయ్ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుంచించుకుపోయిన రహదారులు..
పట్టణంలో సుమారు 100 అడుగుల వెడల్పు ఉండాల్సిన ప్రధాన రహదారులు ఆక్రమణల వల్ల 50 అడుగులకు పరిమితమయ్యాయి. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాల ఆక్రమణలు, అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్తో పాదచారులు నడిచే దారి లేక రోడ్డుపైకి రావాల్సి వస్తోంది. ఫలితంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు రోడ్డు దాటాలం టే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
నిబంధనలకు నీళ్లు.. నిఘా కరువు..
మరోవైపు పట్టణంలో నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, మైనర్ల డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణాలు, మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి.
ప్రజల ప్రాణాలకు విలువ లేదా?
వందల సంఖ్యలో ప్రమాదాలు, పదుల సంఖ్యలో మరణాలు జరుగుతున్నా ఇంకా ఎంతమంది బలి కావాలి? ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఇలాగే మౌనంగా ఉంటారా? ప్రజల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా?‘ అని స్థానికులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు, మున్సిపల్, పోలీస్ అధికారులు సమన్వయంతో స్పందించి రోడ్ల ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు. ఫుట్‌పాత్‌లను పాదచారులకు అందుబాటులోకి తేవాలని, ప్రమాదకర కూడళ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్‌లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం కాకుండా, ప్రమాదాలు జరగకముందే కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.