చెరుకు టన్నుకు రూ.4,500 ఇవ్వాల్సిందే!

09-11-2026 | 08:28pm

ఝరాసంగం మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశం

ఝ‌రాసంగం, న‌వంబ‌ర్ 9 : పాక్షిక కరువు ప్రభావంతో చెరుకు దిగుబడి తగ్గే పరిస్థితులు నెలకొనడం, సాగు పెట్టుబడులు(Cultivation investments) పెరుగుతుండటంతో రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చెరుకు(Sugarcane) టన్నుకు రూ.4,500 మద్దతు ధర ప్రకటించి ఆడుకోవాలని ఝరాసంగం మండలం బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధ్యక్షులు వెంకటేశం డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేయడం, బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గడం విద్యుత్ సరఫరా సమస్యలతో సాగు ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు.

2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అక్టోబర్ 24న జారీ చేసిన జీవో నంబర్ 3 ద్వారా ఝరాసంగం మండలాన్ని ప్రభుత్వం కరుపు ప్రభావిత మండలంగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో చెరుకు పంటకు నిరంతర నీటి ఉండటంతో బోరుబావులపై అవసరం ఆధారపడుతున్న రైతులకు నీటి పారుదల ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయ‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2026--27 సీజనకు చెరకు ఎన్ఆర్పీని క్వింటాలుకు రూ.365, అంటే టన్నుకు రూ.3,650గా నిర్ణయించింది.

దీనికి అదనంగా హర్యానా 2026--27 లో టన్నుకు 5.4,300, పంజాబ్ 2025--26 లో.4,160, ఉత్తరప్రదేశ్ 2025--26లో చెరకు రకాన్ని బట్టి రూ.3,900 నుంచి రూ.4,000 వరకు ధర ప్రకటించాయి. ఇతర రాష్ట్రాల ధరలను పరిశీలించి తెలంగాణలోనూ టన్నుకు రూ.4,500 చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వెంక‌టేశం కోరారు.

మరిన్ని వార్తలు