సిర్గాపూర్ లో శనగ విత్తనాల పంపిణీ: ఏవో హరికృష్ణ

28-10-2026 | 09:33pm

సిర్గాపూర్ అక్టోబర్ 28(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో MANP పథకం(MANP Scheme) కింద బుధవారం రైతులను వరి సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించేందుకు NBEG 47 రకం శనగ విత్తనాలను పంపిణీ చేశారు. మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతులు శనగ సాగుపై ఆసక్తి చూపాలని, పంటల వైవిధ్యంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఏవో హరికృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో భాస్కర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు