బండ్లగూడకు 30 అడుగుల రోడ్లు నిర్మించాలి!

13-11-2026 | 08:18pm

IELA అధికారులకు వినతిపత్రం అందజేసిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

పటాన్ చెరు, నవంబర్ 13: జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నూతనంగా నిర్మించాలని మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కోరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) లెటర్‌హెడ్‌పై IELA (TGIIC) మేనేజింగ్ డైరెక్టర్, జోనల్ మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. టాటా మోటార్స్, ఇక్రిశాట్ నుంచి బండ్లగూడకు వెళ్లే రహదారులు 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక దెబ్బతిన్నాయని, పారిశ్రామిక వాహనాలు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు