విద్యార్థులకు వ్యవసాయం ఆరోగ్యంపై అవగాహన
13-11-2026 | 08:15pm
రాజాపూర్ నవంబర్ 13: మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ విధానంపై రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం(Agricultural University) శాస్త్రవేత్త బాలకృష్ణన్ అవగాహన కల్పించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) వైద్యురాలు డాక్టర్ సుస్మిత విద్యార్థులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇంటిదగ్గర కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి నాణ్యమైన కూరగాయలు పండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి ఎంఈఓ సుధాకర్ ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం అధికారులు పాల్గొన్నారు.