పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

12-11-2026 | 03:10pm

నాగల్‌గిద్ద, నవంబర్ 12 (విజయక్రాంతి): మండలంలోని కరముంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నాగల్‌గిద్ద ఎంపీడీవో మహేష్(Nagalgidda MPDO Mahesh) సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం (MDM)(Midday Meal Scheme) నిర్వహణను పరిశీలించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రతపై ఆరా తీశారు.

విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి పాటిల్, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, గ్రామ పెద్దలు నర్సింగ్ రావు, ఉపాధ్యాయులు రవీందర్ రావు, శివకుమార్, మహేష్, అప్పారావు, జీవన్ రావు, హరికుమార్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు