అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా బోనగిరి ప్రశాంత్ ఏకగ్రీవ ఎంపిక
బెజ్జంకి, అక్టోబర్ 21: సిద్దిపేట జిల్లా(Siddipet District) బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా బోనగిరి ప్రశాంత్(Bonagiri Prashanth), ఉపాధ్యక్షుడిగా బోనగిరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి శంకరయ్య, కార్యదర్శిగా నల్లగొండ రత్నాకర్, కోశాధికారిగా బోనగిరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు యువజన సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం యువజన సభ్యులు పాల్గొన్నారు.