శ్రీ ఆదర్శ స్కూల్ లో బాలల దినోత్సవం
13-11-2026 | 07:20pm
కోహెడ, నవంబర్ 13 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో(Sri Adarsha English Medium High School) ముందస్తుగా బాలల దినోత్సవ(Childrens Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా(Students and teachers) మారి పాఠాలు బోధించారు. చాచా నెహ్రూ(Chacha Nehru) గురించి వివరించారు. కార్యక్రమం చివరలో విద్యార్థులు తమ ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ప్రిన్సిపల్ శైలజ, కరస్పాండెంట్ అంజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.