సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి

03-11-2026 | 07:41pm

యువ ఉద్యోగులు తమ నైపుణ్యాలు వెలికితీయాలని పిలుపు 

భూపాలపల్లిలో ఘనంగా రీజినల్ స్థాయి కల్చరల్ మీట్

భూపాలపల్లి టౌన్, నవంబర్ 03 (విజయక్రాంతి): సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగులలో మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని సింగరేణి భూపాలపల్లి(Singareni Bhupalpally) ఏరియా స్పోర్ట్స్, కల్చరల్ కార్యక్రమాల గౌరవ కార్యదర్శి మర్రి సాయికృష్ణ అన్నారు. మంగళవారం డబ్ల్యూ పీఎస్, జీఏ భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో రీజినల్ స్థాయి కల్చరల్  మీట్ కార్యక్రమాన్ని నిర్వహించగా  సాయికృష్ణ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీయడానికి, సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. సింగరేణి సంస్థలో నూతనంగా ఉద్యోగాల్లో చేరిన యువ ఉద్యోగులు తమలోని కళా నైపుణ్యాలను వెలికితీసి, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ న్యాయ నిర్ణేత కుంట రాజు, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, కల్చరల్ కెప్టెన్ ఆడిచర్ల శ్రీనివాస్, క్లబ్ సెక్రటరీ కాపు చంద్రశేఖర్, ఆర్ జీ 3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సదానందం, కల్చరల్ కెప్టెన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు