మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన

03-11-2026 | 07:44pm

ముదిగొండ, (విజయక్రాంతి): ముదిగొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన(Anti Drug Awareness) సదస్సు నిర్వహించారు. ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, "నషా ముక్త్ విద్యాలయ ఫర్ వికసిత్ భారత్" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పొగాకు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, యుక్త వయసులో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో జీవితంలో లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఎ. అరుణా దేవి, మానసిక వైద్య నిపుణులు డా. సోహైల్, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, నషా ముక్త్ భారత్ కోఆర్డినేటర్ టి. ఉష, PHC వైద్యాధికారి డా. జె. నాగేంద్ర ప్రసాద్, CHO మధుసూదన్, ANM వసంత, అధ్యాపకులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు